Delhi Assembly Elections: యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ కు ఈసీ నోటీసులు

  • కేజ్రీవాల్ బిర్యానీలు సప్లై చేస్తున్నారన్న వ్యాఖ్యలపై సీరియస్
  • రేపు సాయంత్రం 5గం.లోగా వివరణకు గడువు
  • ఈ నెల 8న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నేతల మధ్య పరస్పర ఆరోపణలు శ్రుతిమించడంతో ఎన్నికల సంఘం(ఈసీ) సీరియస్ అయింది. ఈ నెల 8న ఢిల్లీలో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ షహీన్ బాగ్ కు బిర్యానీలు సరఫరా చేస్తున్నారంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఈసీ ఆయనకు నోటీసులు పంపింది.  

ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ..  ప్రధాని మోదీ జాతీయతావాదం, అభివృద్ధికోసం పనిచేస్తూంటే మరోవైపు కాంగ్రెస్, కేజ్రీవాల్ వేర్పాటువాద శక్తులకు తోడ్పాటు అందిస్తున్నారని విమర్శించారు. ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం పోరు సాగిస్తూంటే.. కేజ్రీవాల్ షహీన్ బాగ్ ఆందోళనలకు మద్దతిస్తూ, నిరసనకారులకు బిర్యానీ తినిపిస్తున్నారని అన్నారు. యోగీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ వివరణ ఇవ్వాలంటూ ఆయనకు నోటీసులను జారిచేసింది. ఇందుకు గడువును విధిస్తూ.. శుక్రవారం సాయంత్రం 5గంటలలోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది.

  • Loading...

More Telugu News