Britain Mp Tracy: ఆడవాళ్ల భుజాలను ఆ దృష్టితో చూడడం దురదృష్టం: బ్రిటన్ ఎంపీ ట్రేసీ

  • పార్లమెంటులో ప్రసంగిస్తుండగా భుజం కనిపించడంపై ట్రోలింగ్
  • తానేం టీనేజ్ గర్ల్ ను కాదన్న ట్రేసీ
  • తాను మందు తాగి రాలేదంటూ వ్యాఖ్య 

ఇటీవల బ్రిటన్ పార్లమెంట్ లో ఓ మహిళా ఎంపీ ధరించిన వస్త్రాలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చెలరేగాయి. ఎంపీగా ఉన్న ట్రేసీ బ్రాబిన్ ఇటీవల సభలో ప్రసంగిస్తుండగా.. ఆమె వేసుకున్న గౌను కొంచెం జారటంతో ఆమె భుజం కనిపించింది. దీంతో అందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ అవడంతో వైరల్ గా మారాయి. ‘భుజాలను చూపిస్తూ..  అసభ్యంగా ప్రవర్తించడం బాగాలేదు’ అని నెటిజన్లు విమర్శలను సంధించారు.

దీంతో ట్రేసీ అంతే స్థాయిలో స్పందించారు. ‘మీరు చేసే వ్యాఖ్యలకు జవాబులు ఇచ్చే తీరిక నాకు లేదు. ఒక్కటి మాత్రం చెబుతున్నాను. నేనేమీ మద్యం తాగి పార్లమెంట్ కు రాలేదు. హ్యాంగోవర్ కూడా లేదు. అలాగని టీనేజ్ అమ్మాయిని కాదు. బిడ్డకు పాలిచ్చే తల్లినీ కాను. నేనేమీ చెత్తకుప్ప నుంచి నేరుగా లేచి రాలేదు. ఆడవాళ్ల భుజాలు చూసినా ఉద్రేకానికి లోనవుతారని నాకేం తెలుసు?’ అని ట్విట్టర్లో ఘాటుగా పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు తాజాగా వైరల్ గా మారాయి. 59 ఏళ్ల ట్రేసీ ప్రతిపక్ష లేబర్ పార్టీ తరపున ఎంపీగా కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News