TTD: కశ్మీర్‌లోని పాకిస్థాన్ సరిహద్దులో శ్రీవారి ఆలయం: స్థల పరిశీలనకు వెళ్తున్న టీటీడీ ఈఓ
- ఇప్పటికే రెండు స్థలాలు గుర్తించిన అక్కడి ప్రభుత్వం
- ఏదో ఒకచోట నిర్మాణానికి ఎంపిక చేసుకునే అవకాశం
- వారణాసి, ముంబయిలో కూడా స్వామివారి ఆలయాలు
జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులో శ్రీవారి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం చురుకుగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అక్కడ ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలం ఎంపిక కోసం టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ ఈరోజు ఆ రాష్ట్రానికి వెళ్తున్నారు.
గత ఏడాది డిసెంబరులో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో కశ్మీర్‌తోపాటు ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, ముంబయిలలో వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ మేరకు బోర్డు కోరిక మేరకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఇప్పటికే రెండు స్థలాలను గుర్తించింది. దీంతో ఈవో ఆ రాష్ట్రానికి వెళ్లి ఈ రెండు స్థలాలను పరిశీలించాక తమకు అనుకూలమైన ప్రాంతంలో టీటీడీ ఆలయం నిర్మించే అవకాశం ఉంది.