KTR: తెలంగాణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులపై కేటీఆర్ ప్రశంసల జల్లు

  • ఆరు నెలల్లోనే 3 తీవ్ర నేరాల్లో తీర్పులు వచ్చాయన్న కేటీఆర్
  • ఐదుగురు నిందితులకూ ఉరిశిక్ష పడిందని వెల్లడి
  • ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎంతో శ్రమించాయని ట్వీట్

ఇటీవలే మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో తెలంగాణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పేరుకు తగ్గట్టే సత్వర న్యాయం అందేలా చేశాయని మంత్రి కేటీఆర్ అభినందించారు. కేవలం 6 నెలల వ్యవధిలో తెలంగాణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 3 తీవ్రమైన నేరాల్లో తీర్పులు వెలువరించాయని తెలిపారు. ఈ కేసుల్లో ఐదుగురు నిందితులకూ ఉరిశిక్ష పడిందని తెలిపారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థకు, హోం డిపార్ట్ మెంట్ అధికారులకు శుభాభినందనలు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు తీవ్రంగా శ్రమించారని కొనియాడారు.

  • Loading...

More Telugu News