Vijay Sai Reddy: చంద్రబాబు నోరు విప్పడం లేదు: విజయసాయిరెడ్డి
- ఐటీ సోదాలపై చంద్రబాబు నోరు విప్పడం లేదు
- రెండు రోజులుగా కిక్కురుమనకుండా ఉన్నారు
- ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు
టీడీపీకి సంబంధించిన నేతలతో పాటు చంద్రబాబు మాజీ పీఏపై ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేశారు. మాజీ పీఏతో పాటు తాను పెంచి పోషించిన అవినీతి సర్పాలపై జరుగుతున్న ఐటీ సోదాలపై చంద్రబాబు నోరు విప్పడం లేదని ఆయన అన్నారు. నిప్పుకణికల్లాంటి వారిపై ఈ దాడులేంటని చంద్రబాబు ఇప్పటికే ఐటీ శాఖను నిలదీయాలని ఎద్దేవా చేశారు. ఈ సోదాలపై రెండు రోజులుగా కిక్కురుమనకుండా ఉన్నారని... కియా కంపెనీ లేచిపోతోందంటూ ఫేక్ వార్తలతో ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.