Delhi Assembly Elections: కేజ్రీవాల్ కే మళ్లీ పట్టం కడుతున్న ఢిల్లీ ఓటర్లు.. ఎగ్జిట్ పోల్స్ లో 'ఆప్' హవా!

  • ‘ఆప్’ కు 44కు పైగా స్థానాలు
  • బీజేపీకి  30 లోపే అని అంచనా
  • కాంగ్రెస్ కు రిక్త హస్తమే అన్న ఎగ్జిట్ ఫలితాలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6.30 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి  పోలింగ్ 55 శాతంగా నమోదైంది. 2015 ఎన్నికల్లో నమైదైన పోలింగ్ శాతం కంటే ఇది 12శాతం కంటే తక్కువగా నమోదైంది. ఈ క్రమంలో ఎగ్జిట్ ఫలితాలను పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ ఫలితాల ప్రకారం ఢిల్లీలో మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టే అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ మధ్య తీవ్రపోరు నెలకొనగా, కాంగ్రెస్ సైతం ఉత్సాహంగా బరిలో నిలిచింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెల్లడిస్తారు.

ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలు: మొత్తం స్థానాలు 70

టైమ్స్ నౌ:   ఆప్ 44 , బీజేపీ 26, కాంగ్రెస్ 0 ఇతరులు 0
న్యూస్ ఎక్స్: ఆప్ 53-57, బీజేపీ 11-17, కాంగ్రెస్ 0-2, ఇతరులు 0
రిపబ్లిక్ టీవీ: ఆప్ 48-61, బీజేపీ 9-21, కాంగ్రెస్ 0-1, ఇతరులు 0
న్యూస్ 18:  ఆప్ 44, బీజేపీ 26, కాంగ్రెస్ 0 ఇతరులు 0
ఇండియా టీవీ: ఆప్ 44, బీజేపీ 26, కాంగ్రెస్ 0 ఇతరులు 0


  • Loading...

More Telugu News