Aha: 'ఆహా' యాప్ లో పక్కా బోల్డ్ కంటెంట్... పేరెంటల్ గైడెన్స్ తప్పనిసరన్న అల్లు అరవింద్!
- తెలుగులో ఆన్ లైన్ స్ట్రీమింగ్ యాప్స్
- కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంటాయన్న అరవింద్
- లాంచింగ్ వేడుకలో పాల్గొన్న విజయ్ దేవరకొండ
అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ తదితర ఆన్ లైన్ స్ట్రీమింగ్ యాప్స్ ల తరహాలో అచ్చ తెలుగు యాప్ 'ఆహా' అందుబాటులోకి వచ్చేసింది. మై హోమ్ గ్రూప్, గీతా ఆర్ట్స్ సంస్థలు తయారు చేసిన ఈ యాప్ ప్రారంభోత్సవం సందడిగా సాగింది. విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
ఇక యాప్ గురించిన వివరాలను వెల్లడించిన అల్లు అరవింద్, రోజుకు కేవలం 1 రూపాయితో ఈ యాప్ ద్వారా వినోదాన్ని ఆస్వాదించవచ్చని అన్నారు. ఇది పక్కా బోల్డ్ కంటెంట్ ఉండే యాప్ అని, ఈ మాట చెప్పడానికి తానేమీ మొహమాట పడటం లేదని అన్నారు. ఈ యాప్ ను పేరెంటల్ గైడెన్స్ తోనే వినియోగించుకోవాలని సూచించారు. బెంగాలీ భాషలో అందుబాటులో ఉన్న రీజనల్ ఆన్ లైన్ ఎంటర్ టెయిన్ మెంట్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ 'హోయ్ చోయ్' తమకు స్ఫూర్తని అన్నారు. ఈ యాప్ లో కొత్త సినిమాలు, తెలుగు వెబ్ సిరీస్ లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.