Telangana: మాకు శ్రీశైలం నీరు వదలరా?: ఏపీని ప్రశ్నించిన తెలంగాణ
- నీరంతా శ్రీశైలంలోనే ఉంచుకుంటే ఎలా?
- జనవరిలో 63 టీఎంసీలు వదలాలి
- 5 టీఎంసీలే వదిలారంటున్న తెలంగాణ
కృష్ణా నదిలో నీటి విడుదల విషయమై అసంతృప్తితో ఉన్న తెలంగాణ ప్రభుత్వం, దిగువకు వదలాల్సినంత నీటిని ఎందుకు వదలడం లేదని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నీరంతా శ్రీశైలం రిజర్వాయర్ లో ఉంచుకుంటే, నాగార్జున సాగర్ పరిధిలోని పంటల గతేంటని ప్రశ్నించింది.
జనవరిలో దాదాపు 63 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి వదలాల్సి వుండగా, కేవలం 5 టీఎంసీలను మాత్రమే వదిలారని గుర్తుచేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ రావు, కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. గతంలో జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీశైలం నుంచి సాగర్ కు నీటిని విడుదల చేసేలా ఏపీ సర్కారుకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.