Karnataka: ఏపీ నుంచి వెళ్లిన బస్సుపై కర్ణాటకలో రాళ్ల దాడి.. బంద్ ఉద్రిక్తం
- ఫరంగిపెటెలో ఘటన
- స్థానికులకు 75 శాతం ఉద్యోగాల కోసం బంద్
- సరోజినీ నివేదికను అమలు చేయాలని డిమాండ్
ఈ రోజు ఉదయం తిరుపతి నుంచి కర్ణాటకలోకి మంగళూరు వెళ్లిన బస్సుపై ఫరంగిపెటెలో రాళ్లదాడి జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే డిమాండ్‌తో రెండు రోజుల బంద్‌కు కర్ణాటక రక్షణ వేదిక ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిచ్చారు. సరోజని మహిషి నివేదికను అమలు చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రభుత్వ, స్కూళ్లు, కాలేజీలకు ఎటువంటి సెలవు లేదని విద్యాశాఖ మంత్రి సురేశ్ కుమార్ ప్రకటించారు. శాంతియుతంగా నిరసనలు తెలపాలని కోరారు. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంటోంది. ఆటో, క్యాబ్, రైతు, కార్మిక సంఘాలు రాష్ట్ర బంద్‌లో పాల్గొంటున్నాయి.
నిరసనకారులు తమతో మాట్లాడటానికి అనుకూలంగా ఉంటే వారితో చర్చించడానికి సిద్ధమని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. సరోజినీ మహిషి నివేదికను అమలు చేయడానికి తాము ఇప్పటికే అన్ని ప్రయత్నాలు చేశామన్నారు.కన్నడిగులకు అన్ని రంగాల్లో 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని ఆ నివేదికలో పేర్కొంది.