amazon: లాస్ ఏంజిల్స్‌లోనే అత్యంత ఖరీదైన ఇల్లును కొన్న అమెజాన్ సీఈవో.. ప్రియురాలి కోసమే?
- కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో సౌధం
- ధర 165 మిలియన్ డాలర్లు (రూ.1200 కోట్లు)
- భార్యకు విడాకులు ఇచ్చిన అమెజాన్ సీఈవో
- ప్రియురాలితో కలిసి కొత్త ఇంటి కోసం ఇటీవల అన్వేషణ
కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో 165 మిలియన్ డాలర్లు (రూ.1200 కోట్ల) విలువ చేసే వార్నర్ ఎస్టేట్ ను అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కొనుగోలు చేశారు. ఈ సౌధం అంతకు ముందు వరకు హాలీవుడ్ నిర్మాత డేవిడ్ గిఫెన్ పేరిట ఉండేది. ఆయన నుంచే జెఫ్ బెజోస్ కొన్నారు. లాస్ ఏంజిల్స్ ప్రాంతంలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా ఇది నిలిచింది.
గతంలో ప్రముఖ మీడియా అధినేత లాచ్లాన్ ముర్దోక్ అత్యంత ఖరీదు చేసే (150 మిలియన్ డాలర్లు) ఓ సౌధాన్ని కొన్నారు. ఆయన రికార్డును బెనోస్ బద్దలు కొట్టారని చెప్పుకోవచ్చు. ఈ సౌధం 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.
1937లో జాక్ వార్నర్ అనే వ్యక్తి నిర్మించిన ఈ సౌధాన్ని 1990లో డేవిడ్ గిఫెన్ 47.5 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. భార్యకు విడాకులు ఇచ్చిన అమెజాన్ సీఈవో బెజోస్ తన ప్రియురాలితో కలిసి కొత్త ఇంటి కోసం అన్వేషించినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అందుకే దీన్ని కొన్నాడన్న ప్రచారం జరుగుతోంది.