Sensex: అంచనాలకు మించి పెరగనున్న ద్రవ్యోల్బణం.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- ఎక్కువ నష్టాలను మూటగట్టుకున్న బ్యాంకింగ్ సూచీ
- 106 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 26 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ సూచీలు ఎక్కువ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంచనాల కంటే ఎక్కువగా ద్రవ్యోల్బణం పెరగబోతోందంటూ అధికారిక డేటా వెలువడటంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 106 పాయింట్లు కోల్పోయి 41,459కి పడిపోయింది. నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 12,174 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ కంపెనీ (2.31%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.30%), ఇన్ఫోసిస్ (1.60%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.08%), సన్ ఫార్మా (1.06%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.54%), టాటా స్టీల్ (-1.83%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.71%), ఎన్టీపీసీ (-1.70%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.44%).