Google: గూగుల్ వెనక్కి తగ్గినా ఉచిత వైఫై ఆగదు: రైల్ టెల్ స్పష్టీకరణ

Rail Tel says free wifi will continue in railway stations

  • భారత్ లో రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు నిలిపివేయాలని గూగుల్ నిర్ణయం
  • ఇతర సంస్థల సాయంతో వైఫై కొనసాగిస్తామన్న రైల్ టెల్
  • గూగుల్ భాగస్వామ్యం 415 స్టేషన్లకే పరిమితం అని వెల్లడి

దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందించేందుకు ఐదేళ్ల కిందట గూగుల్ స్టేషన్ పేరిట గూగుల్ ఓ కార్యాచరణ ప్రకటించింది. అయితే, భారత్ లో డేటా అత్యంత చవకగా లభిస్తున్న తరుణంలో ఇంకా తాము ఉచితంగా వైఫై అందించడం ఎందుకని భావించిన గూగుల్ ఉచిత వైఫై కార్యక్రమానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. దీనిపై భారతీయ రైల్వే అనుబంధ సంస్థ రైల్ టెల్ స్పందించింది.

రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై పథకంలో గూగుల్ కేవలం 415 స్టేషన్లలో మాత్రమే భాగస్వామి అని వెల్లడించింది. గూగుల్ తో పాటు మరికొన్ని సంస్థలు కూడా ఇందులో భాగస్వాములని, గూగుల్ వెనక్కి తగ్గినా, తాము ఇతర సంస్థల సాయంతో ఉచిత వైఫై అందించే కార్యక్రమం కొనసాగిస్తామని రైల్ టెల్ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో ఉచిత వైఫై సేవలు అందిస్తున్న రైల్వే స్టేషన్ల సంఖ్య 5600కి చేరిందని వివరించింది.

  • Loading...

More Telugu News