Rana: త్వరలోనే సెట్స్ పైకి 'హిరణ్యకశిప'
- ఏప్రిల్ 2వ తేదీన 'హాథీ మేరే సాథీ' విడుదల
- త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోనున్న 'విరాటపర్వం'
- ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న 'హిరణ్యకశిప'
రానా కథానాయకుడిగా ఆయన కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఒక భారీ పౌరాణిక చిత్రం రూపొందనుంది .. అదే 'హిరణ్యకశిప. సురేశ్ ప్రొడక్షన్స్ వారు 180 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. అనుకోకుండా జరిగే ఖర్చుల నిమిత్తం మరో 20 కోట్లు పక్కకి పెట్టారట. అంటే 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితం కానుంది.
ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను దర్శకుడు గుణశేఖర్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ వేసవిలో పూజా కార్యక్రమాలను నిర్వహించి, ఆ తరువాత రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. రానా చేసిన 'హాథీ మేరే సాథీ' ఏప్రిల్ 2వ తేదీన విడుదల కానుంది. ఆ వెంటనే ఆయన 'విరాటపర్వం' షూటింగును కూడా పూర్తి చేయనున్నాడు. ఆ తరువాత ఆయన 'హిరణ్యకశిప' కోసం రంగంలోకి దిగనున్నట్టు చెబుతున్నారు.