Sensex: నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 429 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 133 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- రెండున్నర శాతం పైగా లాభపడ్డ రిలయన్స్ ఇండస్ట్రీస్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ తదితర కంపెనీలు లాభాలను ముందుండి నడిపించాయి. కరోనా వైరస్ కారణంగా నెలకొన్న ఆర్థిక తిరోగమనాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోనున్నామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రకటించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 429 పాయింట్లు లాభపడి 41,323కి ఎగబాకింది. నిఫ్టీ 133 పాయింట్లు పుంజుకుని 12,126కి పెరిగింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (2.79%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.74%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.60%), ఓఎన్జీసీ (2.47%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.32%).
టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-1.33%), టీసీఎస్ (-0.93%), భారతి ఎయిర్ టెల్ (-0.80%), ఎల్ అండ్ టీ (-0.38%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.28%).