BJP: త్వరలోనే ఏపీ, తెలంగాణలకు కొత్త బీజేపీ అధ్యక్షులు: మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు
- తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నూతన ఉత్సాహంతో ఉంది
- తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయం.. ఏపీలో త్వరలోనే మార్పులు
- సీఏఏ, ఎన్నార్సీలపై విపక్షాలది అనవసర రాద్ధాంతమని విమర్శ
రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలకు త్వరలోనే బీజేపీ కొత్త అధ్యక్షులు రాబోతున్నారని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ కొత్త ఉత్సాహంతో దూసుకుపోతోందని చెప్పారు.