Cricket: ఆసీస్ జోరుకు స్పిన్నర్ పూనమ్ యాదవ్ బ్రేక్
- 27 రన్స్ తేడాతో ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
- మ్యాచ్ పై పట్టు బిగించిన భారత్
- రసవత్తరంగా టి20 వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో ప్రత్యర్థి ముందు చిన్న టార్గెట్ ను ఉంచిన భారత జట్టు ఆటగాళ్లు బౌలింగ్ లో అదరగొడుతున్నారు. స్పిన్నర్ పూనమ్ యాదవ్ దెబ్బకు 27 పరుగుల తేడాలో ఐదు వికెట్లు కోల్పోయిన కంగారూల టీమ్ కష్టాల్లో పడింది. 133 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆసీస్ కు అలీసా హీలీ (35 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ తో 51) మెరుపు ఆరంభం ఇచ్చింది. దాంతో ఓ దశలో 55/1తో ఆతిథ్య జట్టు పటిష్ఠ స్థితిలో కనిపించింది.
కానీ, అదే స్కోరు వద్ద మెగ్ లానింగ్ (5)ను ఔట్ చేసిన రాజేశ్వరి గైక్వాడ్ భారత్ కు బ్రేక్ ఇచ్చింది. అక్కడి నుంచి చకచకా వికెట్లు తీసిన పూనమ్ 14 ఓవర్లకు ఆసీస్ ను 82/6తో కష్టాల్లోకి నెట్టింది. హీలీతో పాటు రాచెల్ (6), ఎలైస్ పెర్రీ (0), జొనాసెన్ (2)ను ఔట్ చేసింది. ఆసీస్ విజయానికి చివరి ఆరు ఓవర్లలో 51 పరుగులు కావాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి.