Varla Ramaiah: జగన్ కంపెనీలో నిమ్మగడ్డ రూ.854 కోట్లు పెట్టుబడి పెట్టిన విషయం నిజం కాదా?: వర్ల రామయ్య
- రస్ అల్ ఖైమా వ్యవహారంపై స్పందించాలి
- జగన్ మౌనం అర్ధ అంగీకారం అనుకోవాలా?
- రస్ అల్ ఖైమా దేశం అంటే ఎందుకు జగన్ వణుకుతున్నారు?
- గెజిట్ నోటిఫికేషన్‌తో జగన్ భయపడిపోతున్నారు
రస్ అల్ ఖైమా డబ్బును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంపెనీల్లో తాను పెట్టుబడిగా పెట్టినట్లు నిమ్మగడ్డ ప్రసాద్ అక్కడి అధికారులకు వెల్లడించారని, దీంతో వైసీపీ వర్గాల్లో ఆందోళన నెలకొందని టీడీపీ నేతలు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ నేత వర్ల రామయ్య మరోసారి ఆరోపణలు గుప్పించారు.
ఈ విషయంపై జగన్ కొనసాగిస్తోన్న మౌనం అర్ధ అంగీకారం అనుకోవాలా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. జగన్‌కి ఎవరో చెత్త సలహాలు ఇస్తున్నారని ఆయన అన్నారు. రస్ అల్ ఖైమా దేశం అంటే ఎందుకు జగన్ వణుకుతున్నారని ఆయన అన్నారు. జగన్‌కి ధైర్యం ఉంటే మీడియా సమావేశంలో ఈ విషయంపై స్పందించాలని ఆయన సవాలు విసిరారు. కేంద్ర ప్రభుత్వం గత నెల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌తో జగన్ భయపడిపోతున్నారని అన్నారు. జగన్ కంపెనీలో నిమ్మగడ్డ రూ.854 కోట్లు పెట్టుబడి పెట్టిన విషయం నిజం కాదా? అని నిలదీశారు.