tammareddy bharadwaja: ఏపీ మూడు రాజధానులపై తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు
- 3 రాజధానులు కాకపోతే 30 పెట్టుకోండి
- తెలుగు వాళ్లమని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తోంది
- నేతలు బూతులు తిట్టుకోవడం మాని సంస్కారవంతులుగా మారాలి
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానుల ప్రకటనపై ప్రముఖ సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు. నేతల తీరు చూసి తెలుగు వాళ్లమని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచికో, చెడుకో అమరావతి అంటూ ఓ రాజధాని ఏర్పడిందని, దానిపై ఏడువేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. మరో రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తే అయిపోతుందని పేర్కొన్నారు. ఇప్పుడా పనిమానేసి మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు రాజధానులు కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండని తీవ్రంగా స్పందించారు. అయితే, పాలన ఎక్కడి నుంచి జరిగితే అది మాత్రమే రాజధాని అవుతుందన్నారు. కొత్తగా పేరు పెట్టినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదన్నారు. అసెంబ్లీలో నేతలు బూతులు తిట్టుకోవడం మాని తొలుత సంస్కారవంతులుగా మారాలని తమ్మారెడ్డి సూచించారు.