Narendra Modi: భారత్–అమెరికా సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం: ప్రధాని మోదీ
- ముగిసిన ద్వైపాక్షిక చర్చలు
- శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతుంది
- సంయుక్త మీడియా సమావేశంలో మోదీ
భారత్–అమెరికా దేశాల మధ్య సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాధినేతలు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. ద్వైపాక్షిక చర్చలు ముగిసిన అనంతరం మోదీ, ట్రంప్ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. తొలుత మోదీ మాట్లాడుతూ, రక్షణ, భద్రత, టెక్నాలజీ వంటి అంశాలపై చర్చలు జరిపామని చెప్పారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతుందని, 21వ శతాబ్దంలో భారత్–అమెరికా స్నేహం కీలకమని అన్నారు.