Aamir Khan: ‘వెబ్’ సీరీస్ బాటలో ఆమిర్ ఖాన్!
- వెబ్ సిరీస్‌లో నటించేందుకు మిస్టర్ పర్ఫెక్ట్ గ్రీన్ సిగ్నల్
- అమెజాన్ లో మల్టీ సిరీస్ ప్లాన్ చేస్తున్న ఆమిర్
- హ్యూమన్ ఇంట్రస్ట్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రం
వైవిధ్య చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సైఫ్ అలీ ఖాన్, షారుక్ ఖాన్ బాటలో నడవాలని భావిస్తున్నాడు. ఈ ఇద్దరు ఖాన్ల మాదిరిగా తాను కూడా వెబ్ సిరీస్ లో అరంగేట్రం చేయాలని చూస్తున్నాడు.
అమెజాన్ నిర్మించే ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఆమిర్ రెడీ అవుతున్నాడు. అయితే, ఇది ఆమిర్ కలల ప్రాజెక్ట్ మహాభారత్ కాదట. ఓ హ్యూమన్ ఇంట్రస్ట్ డ్రామాగా తెరకెక్కబోయే మల్టీ సిరీస్ అని సమాచారం. ఇందుకోసం ఆమిర్ టీమ్‌లోని రైటర్లు మంచి కథను డెవలప్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. డిసెంబర్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, తన పుట్టిన రోజు అయిన మార్చి 14వ తేదీన ఎప్పట్లాగే ఆమిర్ కొత్త సినిమాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి అది వెబ్ సిరీస్ అవుతుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.