Sensex: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం.. కుప్పకూలిన మార్కెట్లు
- 392 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 122 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- నాలుగు శాతం వరకు పతనమైన సన్ ఫార్మా
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిశాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 520 పాయింట్లకు పైగా పతనమైంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 392 పాయింట్లు నష్టపోయి 39,888కి పడిపోయింది. నిఫ్టీ 122 పాయింట్లు కోల్పోయి 11,675కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.63%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.15%), ఏసియన్ పెయింట్స్ (0.13%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.05%).
టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-3.80%), మారుతి సుజుకి (-2.36%), ఎల్ అండ్ టీ (-2.21%), ఇన్ఫోసిస్ (-2.08%), ఓఎన్జీసీ (-2.05%).