Budda Venkanna: క్లెప్టోమానియా జబ్బుతో జగన్ బాధపడుతున్నారు: బుద్ధా వెంకన్న
- ఈ జబ్బు లక్షల్లో ఒకరికి మాత్రమే ఉంటుంది
- దోపిడీ, దొంగతనం, వెర్రి, మూర్ఖపు పట్టుదల ఈ జబ్బు లక్షణాలు
- ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఆనందంగా గేమ్స్ ఆడుకోవడం కూడా ఈ కోవలోకి వస్తాయి
ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. క్లెప్టోమానియా అనే జబ్బుతో జగన్ బాధపడుతున్నారని ట్వీట్ చేశారు. ఈ జబ్బు లక్షల్లో ఒకరికి మాత్రమే ఉండే అత్యంత ప్రమాదకరమైనదని చెప్పారు. దోపిడీ, దొంగతనం, వెర్రి, మూర్ఖపు పట్టుదల, ఇతరులను కష్టపెట్టి ఆనందపడటం వంటివి ఈ జబ్బు లక్షణాలని అన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి, ఆనందంగా గేమ్స్ ఆడుకోవడం కూడా ఈ కోవలోకి వస్తాయని చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ ఉదయం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. 'చంద్రబాబు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్(Narcissistic personality disorder) అనే మానసిక వ్యాధితో బాధ పడుతున్నాడు. తను లేకపోతే ప్రపంచమే లేదనే భ్రాంతి. అందరూ పనికిమాలిన వారనే భావన దీని లక్షణాలు. హింసను ప్రేరేపించేలా మాట్లాడటం, ప్రోత్సహించడం దాని కోవలోకే వస్తాయి' అని ట్వీట్ చేశారు. దానికి కౌంటర్ గానే బుద్ధా వెంకన్న ఈ ట్వీట్ చేశారు.