odisha: గొంతులో ఇరుక్కుపోయిన సీసా మూత.. విలవిల్లాడిపోయిన బాలుడు
- బాధతో విలవిల్లాడి పోయిన బాలుడు
- ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు
- శస్త్రచికిత్స చేసి బయటకు తీసిన వైద్యులు
రాము అనే 9 నెలల బాలుడు ఓ మందు సీసా మూత మింగడంతో అది గొంతులో ఇరుక్కున్న ఘటన ఒడిశాలోని సోంపేట మండలంలో చోటు చేసుకుంది. వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆ మూతను బయటకు తీయడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
రుషికుడ్డ గ్రామానికి చెందిన రాము ఇంటి వద్ద తన అన్న సాత్విక్ (4)తో ఆడుకుంటూ మందు సీసా మూత మింగాడు. ఊపిరి పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని విలవిల్లాడిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు కె.యోగేశ్వరరావు, గీత వెంటనే అతడిని సోంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు గొంతు నుంచి మూతను బయటకు తీసి బాలుడి ప్రాణాలు రక్షించారు.