- విడుదల చేసిన ఇంటర్మీడియట్ బోర్డు
- tsbie.cgg.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు
- మార్చి నాలుగో తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫైనల్ పరీక్షల హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు తమ వివరాలను బోర్డు వెబ్ సైట్ tsbie.cgg.gov.in లో ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది.
ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదు
ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ గానీ, ఏ ఇతర అధికారుల సంతకంగానీ అవసరం లేదని ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. హాల్ టికెట్ పై ఎవరి సంతకం లేకున్నా విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని అధికారులకు సూచించింది.
మార్చి నాలుగు నుంచి పరీక్షలు
మార్చి 4వ తేదీ నుంచి తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న 9,65,839 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. 1,339 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్షల నిర్వహణ కోసం 25,550 మంది ఇన్విజిలేటర్ల సేవలను వినియోగించుకుంటామని అధికారులు తెలిపారు.