chennai: పోలీసుల దుస్తుల్లో టిక్ టాక్ చేసిన నర్సు.. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి హెచ్చరించిన పోలీసులు
- చెన్నైలో ఘటన
- సహాయ నటిగానూ పనిచేస్తోన్న నర్సు
- మరోసారి ఇలాంటి వీడియోను చేయొద్దని చెప్పిన పోలీసులు
టిక్‌టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అయిపోవాలని యువతీయువకులు ఎన్నో వేషాలు వేస్తుంటారు. ఎలగోలా బాగా లైకులు, కామెంట్లు, షేర్లు సంపాదించి పేరు తెచ్చుకోవాలని భావిస్తుంటారు. ఈ పిచ్చే వారికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. తాజాగా పోలీసుల దుస్తుల్లో టిక్ టాక్ చేసిన నర్సు, సహాయ నటి శ్రీనిక అనే అమ్మాయికి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
ఇటీవల ఆమె పోలీసుల దుస్తుల్లో వీడియోలు తీసింది. ఈ విషయాన్ని గుర్తించిన చెన్నై పోలీసులు ఆమెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి వార్నింగ్ ఇచ్చి పంపారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని చెప్పారు. టిక్‌టాక్ వీడియో పోస్ట్ చేసిన ఐపీ నంబరు ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఆమెను పోలీసులు గుర్తించారు.