IPL: ఈసారి నాలుగు జట్లతో మహిళల ఐపీఎల్!
- పురుషుల ఐపీఎల్ లోనే మహిళల మ్యాచ్ లు
- నాలుగు జట్లతో ఏడు మ్యాచ్ ల నిర్వహణ
- మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనున్న జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం
గత ఏడాది పురుషుల ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరిగిన సమయంలో మూడు మహిళల జట్లు కూడా మైదానంలో సందడి చేశాయి. మహిళల క్రికెట్ ను కూడా ఐపీఎల్ తరహాలో అభివృద్ధి చేసే ఉద్దేశంతో అప్పట్లో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మూడు జట్లతో నిర్వహించిన ఆ మ్యాచ్ లకు ప్రేక్షకాదరణ లభించడంతో ఈసారి వాటికి అదనంగా మరో జట్టును బరిలో దింపనున్నారు. ఈ ఏడాది పురుషుల ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరిగే సమయంలోనే నాలుగు మహిళల జట్లతో 2020 మహిళల టి20 చాలెంజ్ టోర్నీ నిర్వహిస్తారు. ఈ చాలెంజ్ లో భాగంగా మొత్తం ఏడు మ్యాచ్ లు జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరగనున్నాయి. ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు ఈ టోర్నీలో ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.