Allu Arjun: కన్న తండ్రిని 'బే' అంటున్న అర్హ... తెగ వైరల్ అవుతున్న బన్నీ పోస్ట్ చేసిన వీడియో!
- కూతురితో అల్లు అర్జున్ ముచ్చట్లు
- పదేపదే 'బే' అని అంటున్న అర్హ
- నన్నే అంటావా? అంటూ ముద్దులు
తన ముద్దుల తనయ అర్హ ఏం చేసినా, దాన్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో అల్లు అర్జున్ పంచుకుంటూ ఉంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా బన్నీ పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అల్లు అర్జున్, మోకాళ్లపైకి ఎక్కి కూర్చున్న అర్హ, తండ్రిని 'బే' అని అంటోంది. ఈ వీడియోలో అర్హ పదేపదే 'బే... బే' అంటూ బన్నీని అంటుండగా, నన్ను... కన్నతండ్రినే బే అంటావా? అంటూ ముద్దు చేస్తున్న దృశ్యాలున్నాయి. ఈ మొత్తం వీడియోలో ఆరుసార్లు తండ్రిని 'బే' అని అర్హ అంటుంటే, అంతకన్నా ఎక్కువ సార్లు బన్నీ, కూతురిని అదే విధంగా పిలుస్తున్నాడు. ఈ వీడియోను మీరూ చూడవచ్చు.