Rana: మా వాళ్లందరూ బాగా చదువుకున్నారు, నేను టెన్త్ ఫెయిల్: రానా

Rana Daggubati says that he was a failed student

  • చిత్రసీమలో రానా పదేళ్ల ప్రస్థానం
  • వీడియో రూపొందించిన సురేశ్ ప్రొడక్షన్స్
  • ఓ దశలో జీవితంపై స్పష్టత లేదన్న రానా
  • గ్రాఫిక్స్ విభాగంతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ
  • వీఎఫ్ఎక్స్ విభాగంలో సైనికుడు చిత్రానికి నంది అవార్డు అందుకున్నట్టు వెల్లడి

టాలీవుడ్ భల్లాలదేవుడు రానా చిత్రసీమలో ప్రవేశించి ఈ ఏడాదితో పదేళ్లు అవుతున్న నేపథ్యంలో సురేశ్ ప్రొడక్షన్స్ ప్రత్యేక వీడియో రూపొందించింది. ఈ వీడియోలో రానా తండ్రి సురేశ్ బాబు, బాబాయి వెంకటేశ్, దర్శకులు నాగ్ అశ్విన్, క్రిష్, హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగచైతన్య తదితరులు రానా గురించి అనేక వివరాలు తెలిపారు. అంతేకాదు, రానా కూడా తన గురించి తాను వెల్లడించారు.

తన కుటుంబంలో అందరూ బాగా చదువుకున్న వారేనని, తండ్రి సురేశ్ బాబు మెకానికల్ ఇంజినీరింగ్ చదివారని, బాబాయి వెంకటేశ్ ఎంబీఏ చదివారని వెల్లడించారు. తాను మాత్రం టెన్త్ ఫెయిల్ అంటూ నిజాయతీగా అంగీకరించారు. ఓ దశలో ఎలాంటి లక్ష్యం లేకుండా గడిపానని, ఏం సాధించాలో స్పష్టత లేకపోయిందని తెలిపారు.

 చిన్నప్పటి నుంచి స్నేహితులైన రామ్ చరణ్, అల్లు అర్జున్ లు మొదటి నుంచి ఓ స్పష్టతతో పెరిగారని పేర్కొన్నారు. చివరికి సినిమాయే జీవితం అని అర్థం చేసుకుని మొదట గ్రాఫిక్స్ విభాగంలో ప్రవేశించి 85 సినిమాలకు పనిచేశానని, సైనికుడు చిత్రంలో వీఎఫ్ఎక్స్ కు గాను నంది అవార్డు కూడా అందుకున్నానని తెలిపారు. నటుడ్ని అవ్వాలనుకున్న తర్వాత ఫారెన్ లో శిక్షణ పొందానని, ఎన్టీఆర్ సినిమాలు చూసి భాషపై పట్టు పెంచుకున్నానని రానా వివరించారు. తన జీవితం అంతా సినిమాలతోనే ముడిపడిందని అర్థం చేసుకున్నాక ఓ స్పష్టత వచ్చిందని చెప్పారు.

  • Loading...

More Telugu News