Corona Virus: ఒక్కరోజులో చైనా బయటి దేశాల్లో 1500 మందికి కరోనా... డబ్ల్యూహెచ్ఓ సంచలన ప్రకటన!

Corona Virus expands in 64 countries

  • మృతుల సంఖ్య 24 నుంచి 128కి
  • మొత్తం 64 దేశాలకు విస్తరణ
  • వృద్ధులు జాగ్రత్తగా ఉండాలన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్

కేవలం ఒకే ఒక్క రోజులో చైనా మినహా మిగతా దేశాల్లో 1,500 మందికి కోవిడ్-19 (కరోనా) వైరస్ సోకిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంచలన ప్రకటన వెలువరించింది. ఇదే సమయంలో చైనాను వదిలేస్తే, మిగతా దేశాల్లో మరణించిన వారి సంఖ్య 24 నుంచి 128కి పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

ఇప్పటివరకూ మొత్తం 64 దేశాలకు వైరస్ విస్తరించిందని, ఈ దేశాల్లో 8,774 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని తన నివేదికలో తెలిపింది. రోజురోజుకూ వైరస్ విస్తరిస్తోందని, ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితని అభిప్రాయపడింది.

ఈ దేశాల్లోని 60 ఏళ్ల పైబడిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది. ముఖ్యంగా గుండె జబ్బులతో పాటు షుగర్, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి ఈ వైరస్ సులువుగా సోకుతుందని, వారు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరగవద్దని ప్రపంచ ఆరోగ్యసంస్థ అధిపతి డాక్టర్ టెడ్రోస్ అధ్నామ్ గీభ్రీయేసూస్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News