nagababu: 'కరోనా' వైరస్‌ విజృంభణ నేపథ్యంలో.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

nagababu on corona virus

  • ఈ భూమి మీద మనిషి అనే జీవి పూర్తిగా చస్తే అంటూ వ్యాఖ్యలు
  • అలా జరిగితే ఈ భూమి, ప్రకృతి, వాతావరణం అద్భుతంగా ఉంటాయి
  • మిగిలిన జీవరాసులు చాలా చాలా సంతోషంగా జీవిస్తాయి
  • సర్వ జీవరాసులు ప్రకృతి ధర్మాలకు లోబడి బతుకుతున్నాయి 

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ గురించి జనసేన నేత, సినీనటుడు నాగబాబు సరికొత్త వ్యాఖ్యలు చేశారు. 'ఈ భూమి మీద మనిషి అనే జీవి పూర్తిగా చస్తే ఈ భూమి, ప్రకృతి, వాతావరణం అద్భుతంగా ఉంటాయి. మిగిలిన జీవరాసులు చాలా చాలా సంతోషంగా జీవిస్తాయి' అని అన్నారు.
 
'సర్వ జీవరాసులు ప్రకృతి ధర్మాలకు లోబడి బతుకుతున్నాయి... కరోనా వైరస్ సహా... ఒక్క మనిషి తప్ప' అని నాగబాబు ట్వీట్లు చేశారు. కాగా, ఆయన చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. 'ఆ మనుషుల్లో మీరు కూడా ఉన్నారు కదా?' అంటూ రిప్లై ఇస్తున్నారు.

కాగా, ఇంత నాగరికత పొందిన మానవుడు పర్యావరణాన్ని దెబ్బతీస్తూ, ప్రకృతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, చేజేతులా ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాడన్న ఆవేశం, ఆక్రోశం నాగబాబు మాటల్లో కనిపిస్తున్నాయని చెప్పచ్చు.
 


  • Loading...

More Telugu News