Amaravati: అమరావతిపై అంతర్జాతీయ కోర్టులో పిటిషన్.. త్వరలోనే విచారణ ప్రారంభం
- ది హేగ్ లోని అంతర్జాతీయ కోర్టులో పిటిషన్ వేసిన అమెరికా ఎన్నారైలు
- పిటిషన్ కు వారంలోగా సీరియల్ నెంబర్ కేటాయించనున్న అంతర్జాతీయ కోర్టు
- త్వరలోనే విచారణ ప్రారంభం
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ది హేగ్ నగరంలోని అంతర్జాతీయ కోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న ఎన్నారైలు ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. అమెరికా ఎన్నారైల తరపున శ్రీనివాస్ కావేటి నిన్న ఈ పిటిషన్ వేశారు.
ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆదేశాలను జారీ చేయాలని... రాజధాని ప్రాంత రైతులకు న్యాయం చేయాలని పిటిషన్ లో ఎన్నారైలు అంతర్జాతీయ కోర్టుకు విన్నవించారు. వారం రోజుల్లోగా ఈ పిటిషన్ కు సీరియల్ నెంబర్ ను అంతర్జాతీయ కోర్టు కేటాయించనుంది. త్వరలోనే విచారణ ప్రారంభంకానుంది.
మరోవైపు, అమరావతి ప్రాంత రైతులను పోలీసుల సాయంతో వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని... ఈ విషయాలను ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం దృష్టికి తీసుకెళతామని యూఎస్ ఎన్నారైలు తెలిపారు.