India: సీఏఏపై జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంలో ఐక్యరాజ్యసమితి పిటిషన్... ఘాటుగా బదులిచ్చిన కేంద్రం

India counters it hard as UNHRC files petition over CAA in SC

  • సీఏఏపై దేశంలో అల్లర్లు
  • స్పందించిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్
  • బయటి వాళ్లు జోక్యం చేసుకోలేరని బదులిచ్చిన విదేశాంగ శాఖ
  • పూర్తిగా అంతర్గత వ్యవహారమని వెల్లడి

కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఓ వర్గం వ్యతిరేకిస్తున్న సంగతి విదితమే. ఢిల్లీ తదితర ప్రాంతాల్లో హింస చెలరేగి అనేకమంది ప్రాణాలను కూడా బలిగొంది. దీనిపై స్పందించిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సీఏఏపై జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దీనికి కేంద్రం ఘాటుగా బదులిచ్చింది. ఐక్యరాజ్యసమితి చర్యను ఖండించింది. సీఏఏ పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని, ఇందులో జోక్యం చేసుకునే అధికారం మరే ఇతర దేశానికి గానీ, బయటి వ్యవస్థలకు గానీ లేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ స్పష్టం చేశారు. ఓ సార్వభౌమ దేశంగా చట్టాలు చేసే హక్కు భారత్ కు ఉందని, సీఏఏ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉందన్న విషయంలో భారత్ స్పష్టమైన వైఖరితో ఉందని తెలిపారు. రాజ్యాంగపరంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కూడా నిర్ధారిస్తుందని నమ్ముతున్నామని ఓ ప్రకటనలో వెల్లడించారు.

  • Loading...

More Telugu News