Sensex: కరోనా వైరస్ ధాటికి నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex and Nifty End Lower As Rising Coronavirus Cases Weigh On Sentiment

  • 214 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 52 పాయింట్లు పతనమైన నిఫ్టీ
  • 4 శాతం వరకు నష్టపోయిన ఇండస్ ఇండ్ బ్యాంక్

ఇండియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వరుసగా ఏడు రోజులు నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు నిన్ననే కోలుకున్నాయి. ఈరోజు కరోనా కలకలం మరింత ఎక్కువ కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో ఈరోజు ఇంట్రాడేలో సూచీలు తీవ్ర ఒడిడుదుకులకు గురయ్యాయి. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 780 పాయింట్ల వరకు నష్టపోయింది. అయితే చివర్లో మార్కెట్లు కొంత మేర కోలుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 214 పాయింట్లు పెరిగి 38,409కి పడిపోయింది. నిఫ్టీ 52 పాయింట్లు పతనమై 11,251 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (3.14%), ఏసియన్ పెయింట్స్ (2.68%), టెక్ మహీంద్రా (2.45%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.24%), టీసీఎస్ (2.17%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.85%), బజాజ్ ఫైనాన్స్ (-3.79%), ఐటీసీ (-3.30%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.94%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.74%).

  • Loading...

More Telugu News