Lakshmi Parvati: బీసీలకు మంచి జరుగుతుంటే ఓర్వలేని బాబు తన మనిషితో కేసు వేయించారు: లక్ష్మీపార్వతి

Lakshmi Parvathi alleges TDP supremo Chandrababu over bc reservations issue
  • బీసీ రిజర్వేషన్ అంశంలో టీడీపీ, వైసీపీ మధ్య విమర్శల దాడి
  • ప్రభుత్వం 59 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్న లక్ష్మీపార్వతి
  • కేంద్ర నిధుల కోసం ఒప్పుకుంటే మరో కేసు వేశారని ఆరోపణ
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశం వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం రగిల్చింది. తాజాగా ఈ అంశంలో తెలుగు అకాడమీ చైర్ పర్సన్, వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి స్పందించారు. బీసీలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే బాబు తన మనిషి ప్రతాప్ రెడ్డితో కేసు వేయించారని ఆరోపించారు. ఈ నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి నిధులు రావన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఒప్పుకుంటే దీనిపై మరో కేసు వేశారని మండిపడ్డారు.
Lakshmi Parvati
BC Reservations
Chandrababu
Court
YSRCP
Telugudesam
Andhra Pradesh
Local Body Elections

More Telugu News