Telangana: మాస్క్‌ల ఉచిత పంపిణీపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana High Court Orders to Supply of free Masks

  • మురికివాడల్లోని పేదలకు మాస్కులు, శానిటైజర్లు ఉచితంగా అందించండి
  • బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయండి
  • వైరస్ విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్న ఐపీఎం డైరెక్టర్

కరోనా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. సిద్ధలక్ష్మి అనే మహిళ దాఖలు చేసిన పిల్‌పై నిన్న రెండో రోజూ విచారణ కొనసాగింది. అనంతరం.. రేషన్ దుకాణాల ద్వారా మురికివాడల్లోని పేదలకు మాస్కులు, శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మురికివాడలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆ ప్రాంతాల్లో కరోనా వైరస్ మరింత వ్యాపించే అవకాశం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్‌, జస్టిస్ ఎ. అభిషేక్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. కాగా, ప్రభుత్వం తరపున కోర్టుకు హాజరైన ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్, కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలను ధర్మాసనానికి తెలిపారు. గాంధీ, టీబీ, ఛాతీ, ఫీవర్‌ ఆస్పత్రులలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని, అక్కడ చికిత్స అందించడంతోపాటు అవసరమైన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News