DMK: డీఎంకే ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకుడు అన్బళగన్ కన్నుమూత

DMK General Secretary K Anbazhagan Dies At 97 In Chennai

  • డీఎంకే స్థాపనలో అన్బళగన్ కీలక పాత్ర
  • కరుణానిధికి కుడిభుజం
  • అంజలి ఘటించిన డీఎంకే చీఫ్ స్టాలిన్

వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ గత కొంతకాలంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.అన్బళగన్ 97 ఏళ్ల వయసులో ఈ ఉదయం కన్నుమూశారు. 1949లో అన్నాదురై ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) స్థాపించినప్పుడు అన్బళగన్ కీలకంగా వ్యవహరించారు. ఐదు దశాబ్దాలకు పైగా కరుణానిధికి కుడి భుజంలా వ్యవహరించారు.

అన్బళగన్ మృతి వార్త తెలిసిన వెంటనే డీఎంకే చీఫ్ స్టాలిన్ సహా పార్టీ నేతలందరూ కలిసి అపోలోకు చేరుకుని అంజలి ఘటించారు. ప్రస్తుతం చెన్నైలోని కిల్‌పాకంలోని అన్బగళన్ నివాసంలో ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయన్ని ఉంచారు. నేటి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  

1957లో అన్బళగన్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం తొమ్మిదిసార్లు శాసనసభకు, ఒకసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కరుణానిధి కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు.

  • Loading...

More Telugu News