Telangana: తెలంగాణ బడ్జెట్: ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 3 కోట్లు
- నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా కేటాయింపు
- ఎమ్మెల్సీలకు కూడా ఇవ్వాలని నిర్ణయం
- ఇందుకోసం బడ్జెట్ లో రూ.480 కోట్లు కేటాయింపు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గాల్లో అవసరమైన అభివృద్ధి పనులు చేసుకునేందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఇందుకోసం బడ్జెట్ లో రూ.480 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు.
‘‘ప్రజల చేత చట్టసభలకు ఎన్నికై, రాష్ట్ర అభివృద్ధికి విధానాలు రూపొందించే వారు ఎమ్మెల్యేలు. అంతటి గురుతర బాధ్యత నిర్వర్తించే ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో సొంత కార్యాలయాలు ఉండాలని సీఎం కేసీఆర్ గతంలోనే నిర్ణయించారు. ఇప్పటివరకు 82 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కార్యాలయాలు నిర్మించాం.” అని హరీశ్ రావు తెలిపారు.