Talasani: హైదరాబాద్​ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించిన కేసీఆర్​ కు కృతఙ్ఞతలు: మంత్రి తలసాని

Minister Talasani Yadav express happiness about state Budget

  • సమైక్య పాలనలో హైదరాబాద్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది
  • కేసీఆర్ పాలనలో  విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది
  • డబుల్ బెడ్ రూం పథకానికి రూ.11,917 కోట్లు ప్రతిపాదించడం అభినందనీయం

తెలంగాణ బడ్జెట్ పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం కేసీఆర్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతఙ్ఞతలు తెలిపారు. నాలుగు వందల ఏళ్ల చరిత్ర గల హైదరాబాద్ నగరం అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరంగా గుర్తింపు పొందిందని, సమైక్య పాలనలో హైదరాబాద్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోందని, డబుల్ బెడ్ రూం పథకానికి రూ.11,917 కోట్లు ప్రతిపాదించడం అభినందనీయమని, ప్రతి డివిజన్ కు రెండు బస్తీ దవాఖానాలు ఉండే విధంగా, 350 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. 

  • Loading...

More Telugu News