Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో ఇద్దరు అధ్యక్షులు.. ప్రత్యర్థులిద్దరూ వేర్వేరుగా ప్రమాణ స్వీకారం!
- గతేడాది సెప్టెంబరులో అధ్యక్ష ఎన్నికలు
- మరోమారు విజయం సాధించిన అష్రఫ్ ఘనీ
- అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రత్యర్థి
ప్రపంచంలోనే తొలిసారిగా ఆఫ్ఘనిస్థాన్‌కు ఇప్పుడు ఇద్దరు అధ్యక్షులున్నారు. ఆ ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులు కావడం మరో విశేషం. అసలైన దేశాధ్యక్షుడిని తానేనంటూ ఇద్దరూ వేర్వేరుగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో దేశానికి అసలు అధ్యక్షుడెవరో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.
గతేడాది సెప్టెంబరులో జరిగిన అధ్యక్షుల్లో అష్రాఫ్ ఘనీ విజయం సాధించినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ఘనీ ప్రత్యర్థి అబ్దుల్లా అబ్దుల్లా తనదే విజయమని ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో నిన్న ఇద్దరూ వేర్వేరుగా ఎవరికి వారే తమ మద్దతుదారుల మధ్య అధ్యక్షులుగా ప్రమాణం స్వీకారం చేశారు.