Monkeys: అష్టకష్టాలు పెడుతున్న కోతుల బెడదను తప్పించుకునేందుకు సైనికుల మాస్టర్ ప్లాన్... వీడియో ఇదిగో!

ITBP Army Plan to escape from Monkeys
  • ఉత్తరాఖండ్ లో సమస్యగా మారిన కోతులు
  • ఎగుగుబంటి వేషాలు వేసిన ఐటీబీపీ సైనికులు
  • పారిపోయిన కోతుల వీడియో వైరల్
తమ ప్రాంతంలో సమస్యగా మారిన కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ (ఐటీబీపీ) సైనికులు వేసిన ఓ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే, తమ గదుల్లోకి వచ్చి, ఆహారాన్ని, వస్తువులను దోచుకెళుతున్న కోతులకు చెక్ పెట్టాలని ఉత్తరాఖండ్ లోని ఐటీబీపీ సైన్యం వినూత్న ప్రయత్నం చేసింది.

రాష్ట్రంలోని మిడ్తీ క్యాంప్ లో గత కొంతకాలంగా కోతుల సమస్య అధికమైంది. గుంపులుగా వచ్చి పడుతున్న మర్కటాలను భయపెట్టి తరిమేసేందుకు సైనికులు ఓ ప్లాన్ వేశారు. ఇద్దరు సైనికులకు ఎలుగుబంటి వేషాలు వేశారు. వారిద్దరూ ఒక్కసారిగా తమ గది నుంచి బయటకు రాగానే, పదుల సంఖ్యలో అక్కడే మకాం వేసివున్న కోతులు పలాయనం చిత్తగించాయి. నిజంగానే ఎలుగుబంటి వచ్చిందని కోతులు భావించి ఉరుకులు, పరుగులు పెట్టాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.
Monkeys
Uttarakhand
Army
Bear

More Telugu News