Btech Ravi: సతీశ్‌రెడ్డి రాజీనామాతో పార్టీకి వచ్చే నష్టమేమీ లేదు: బీటెక్ రవి

Btech Ravi responds about Satish reddy resignation
  • సతీశ్‌రెడ్డి పార్టీని వీడడం బాధగా ఉంది
  • అయినా, రాజకీయాల్లో ఇవన్నీ మామూలే
  • పులివెందులలో వైఎస్ కుటుంబం బలాబలాలేమిటో తెలుసు
పులివెందుల టీడీపీ నేత సతీశ్‌రెడ్డి పార్టీని వీడడం బాధగా ఉందని ఆ పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. ఆయన పార్టీని వీడడం బాధగా ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఇది చాలా సర్వసాధారణమైన విషయమని తేలిగ్గా తీసుకున్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన టీడీపీని వీడినట్టు భావిస్తున్నానని రవి చెప్పుకొచ్చారు. సతీశ్‌రెడ్డి పార్టీని వీడడం వల్ల టీడీపీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. అధిష్ఠానం ఆదేశాలతో పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు తీసుకుని ముందుకు నడిపిస్తానని అన్నారు. పులివెందులలో వైఎస్ కుటుంబం బలాబలాలు ఏమిటో తనకు తెలుసన్న రవి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.

సతీశ్‌రెడ్డి పార్టీని వీడిన నేపథ్యంలో జిల్లా టీడీపీ చీఫ్ శ్రీనివాసరెడ్డి, బీటెక్ రవి.. చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలో పార్టీ పరిస్థితిని అధినేతకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో పార్టీ బాధ్యతలను రవికి అప్పగించాలని చంద్రబాబుకు సూచించినట్టు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
Btech Ravi
Telugudesam
Satish Reddy
Pulivendula

More Telugu News