YS Vivekananda Reddy: ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం.. వైఎస్​ వివేకా హత్య కేసు సీబీఐకి అప్పగింత

AP High court orders to handover ys viveka murder case to CBI

  • సాధ్యమైనంత త్వరగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలి
  • కేసు దర్యాప్తులో సమయం చాలా కీలకం
  • అందుకే, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నాం

ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐను ఆదేశించింది. ఈ హత్య జరిగి ఏడాదిన్నర కాలం గడుస్తున్నా దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తులో సమయం చాలా కీలకం కనుక ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి సీఎం జగన్ పిటిషన్ ఉపసంహరణ ప్రభావం దర్యాప్తుపై ఉండకూడదని సూచించింది. పులివెందుల పోలీస్ స్టేషన్నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది.

కాగా, 2019 మార్చి 15 వైఎస్ వివేకా హత్య జరిగింది. ఈ కేసును ఛేదించేందుకు మూడుసార్లు సిట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినా, ఈ కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో  నిందితులను ఇంతవరకూ తేల్చలేదు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆయన భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, తదితరులు గతంలో పిటిషన్లు వేశారు.

  • Loading...

More Telugu News