Kaleswaram: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం
- అనంతగిరి రిజర్వాయర్ కు ఎత్తిపోతల ట్రయల్ రన్
- విజయవంతమైన ట్రయల్ రన్
- లక్షలాది ఎకరాలకు నీరు అందించే ఉద్దేశంతో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు
- ఇంజినీరింగ్ అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు గుర్తింపు
తెలంగాణ ప్రభుత్వం ఎంతో వ్యయప్రయాసల కోర్చి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. లక్షలాది ఎకరాలకు నీరు అందించే ఉద్దేశంతో భారీస్థాయిలో ఇంజినీరింగ్ అద్భుతం అనదగ్గ రీతిలో నిర్మించిన ఈ ప్రాజెక్టు నుంచి తాజాగా అనంతగిరి రిజర్వాయర్ కు నీటి ఎత్తిపోతల ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోవడంతో సర్వత్ర హర్షం వ్యక్తమైంది. దీనికి సంబంధించిన వీడియోను టీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ లో పోస్టు చేసింది.