Sensex: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

Sensex ends in green

  • 62 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 7 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 7 శాతానికి పైగా నష్టపోయిన టాటా స్టీల్

కరోనా దెబ్బకు గత కొన్ని సెషన్లుగా నష్టపోయిన దేశీయ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఈనాటి ట్రేడింగ్ ఆద్యంతం మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 62 పాయింట్లు పుంజుకుని 35,697కి పెరిగింది. నిఫ్టీ 7 పాయింట్లు లాభపడి 10,458కి చేరింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హీరో మోటో కార్ప్ (4.08%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.60%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.80%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.51%), ఎల్ అండ్ టీ (1.35%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-7.11%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-5.80%), ఓఎన్జీసీ (-4.04%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.35%), ఇన్ఫోసిస్ (-2.66%).

  • Loading...

More Telugu News