KTR: నిజంగానే విమానం నడిపిన అనుభూతిని సొంతం చేసుకున్న కేటీఆర్... వీడియో ఇదిగో!
- శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ సిమ్యులేటర్ ఏర్పాటు
- సిమ్యులేటర్ వ్యవస్థను ప్రారంభించిన సీఎం కేసీఆర్
- పైలెట్ సాయంతో విమానం ఇంజిన్ ను ఆపరేట్ చేసిన కేటీఆర్
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సహకారంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫ్లైట్ సిమ్యులేటర్ టెక్నిక్ సెంటర్ (ఎఫ్ఎస్ టీసీ)ను నెలకొల్పారు. తాజాగా ఈ సిమ్యులేటర్ వ్యవస్థను తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సిమ్యులేటర్ ద్వారా విమానంతో పనిలేకుండానే విమానం నడిపేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారు. పైలెట్లకు మొదటగా శిక్షణ ప్రారంభమయ్యేది సిమ్యులేటర్లపైనే. ఆ తర్వాతే అసలు విమానాల్లో శిక్షణ ఇస్తారు. విమానం ఇంజిన్ లో ఎలాంటి వాతావరణం ఉంటుందో సిమ్యులేటర్ లోనూ అదే తరహా యంత్రాంగ్రం ఉంటుంది.
మంత్రి కేటీఆర్ ఈ ఫ్లైట్ సిమ్యులేటర్ లో కూర్చుని తాను కూడా మీటలు నొక్కుతూ నిజంగానే విమానం నడిపిన అనుభూతి సొంతం చేసుకున్నారు. కాక్ పిట్ లో ఉన్న పైలెట్ మంత్రి కేటీఆర్ కు సూచనలు ఇస్తూ ఆయనతో విమానం ఇంజిన్ ను ఆపరేట్ చేయించారు.