Kane Richardson: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కు కరోనా.. ప్రేక్షకులు లేకుండానే సిడ్నీలో జరుగుతున్న వన్డే మ్యాచ్ 

Australian Cricketer Kane Richardson Tested For Coronavirus

  • కేన్ రిచర్డ్ సన్ కు కరోనా పాజిటివ్ 
  • క్వారంటైన్ కు తరలింపు
  • దక్షిణాఫ్రికా టూర్ నుంచి వచ్చిన తర్వాత గొంతు ఇన్ఫెక్షన్

కరోనా ఎఫెక్ట్ క్రీడారంగంపై కూడా పెను ప్రభావాన్ని చూపుతోంది. ఈ మహమ్మారి బారిన క్రీడాకారులు కూడా పడుతున్నారు. తాజాగా ఆస్టేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్ సన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని అధికారులు ఈరోజు అధికారికంగా ప్రకటించారు. సౌతాఫ్రికా టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత గొంతు నొప్పితో రిచర్డ్ సన్ బాధపడ్డాడు. అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే అతన్ని క్వారంటైన్ గదికి తరలించారు.

ఈ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ, రిచర్డ్ సన్ కు వచ్చిన గొంతు ఇన్ఫెక్షన్ ను చాలా తీవ్రమైనదిగా భావిస్తున్నామని, ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనలను తాము పాటిస్తున్నామని తెలిపారు. రిచర్డ్ సన్ కోలుకున్న తర్వాత అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకుంటామని చెప్పారు.

మరోవైపు సిడ్నీలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల మధ్య ఈరోజు తొలి వన్డే జరుగుతోంది. కరోనా భయాలతో ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించలేదు. ఈ వారంలో జరగాల్సిన ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ కూడా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News