Varla Ramaiah: డీజీపీని కోర్టులో నిల్చునే విధంగా చేసిన ఘనత జగన్ దే: వర్ల రామయ్య

Varla Ramaiah questions state government on recent incidents

  • పోలీసుల శైలి సందేహాస్పదంగా ఉందన్న వర్ల
  • చట్టం, నేరం కలిసి ప్రయాణిస్తున్నాయంటూ వ్యాఖ్యలు
  • కోర్టు చెబితేనే మీకు అర్థమవుతుందా? అంటూ వ్యంగ్యం

ఏపీలో చట్టం, నేరం కలిసి ప్రయాణిస్తున్నాయంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చంద్రబాబు విశాఖ పర్యటనలో చోటుచేసుకున్న పరిణామాలు, మాచర్ల దాడి ఘటన, తెనాలిలో అక్రమ మద్యం ఘటనలపై స్పందిస్తూ ఆయన ఈ విధంగా స్పందించారు. పలుచోట్ల పోలీసుల వ్యవహారశైలి సందేహాస్పదంగా మారిందని ఆరోపించారు. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళుతున్నట్టు చంద్రబాబు పోలీసులకు ముందుగానే సమాచారం అందించారని, పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ దేనని అన్నారు. డీజీపీని సైతం కోర్టులో నిల్చునే విధంగా చేశారంటూ ఎద్దేవా చేశారు.

మాచర్ల దాడి ఘటన చూసిన తర్వాత కూడా శాంతిభద్రతలు బాగున్నాయని పోలీసులు ఎలా చెబుతారని ప్రశ్నించారు. మాచర్ల ఘటన దర్యాప్తులో అన్నీ తప్పటడుగులేనని వర్ల విమర్శించారు. నేరస్తుడికి సాయం చేయాలన్న ఉద్దేశంతోనే హత్యాయత్నం కేసు పెట్టలేదని అర్థమవుతోందని అన్నారు. మాచర్ల సీఐపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో డీజీపీ ప్రకటన చేయాలని వర్ల డిమాండ్ చేశారు. తెనాలి ఘటనలో ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటూ ప్రశ్నించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాలన్నీ కోర్టు చెబితేనే అర్థమవుతాయా? అంటూ వ్యంగ్యంగా అడిగారు. 

  • Loading...

More Telugu News