Corona Virus: కరోనాతో మృతి చెందిన సిద్ధిఖీ అంత్యక్రియల్లో పాల్గొన్న అందరిపైనా నిఘా

Karnataka Officials monitoring Siddiqui family members

  • హైదరాబాద్‌లో మృతి చెందిన 76 ఏళ్ల సిద్ధిఖీ
  • కర్ణాటకలోని కులబుర్గిలో అంత్యక్రియలు
  • అంత్యక్రియల్లో పాల్గొన్న 67 మందికీ చికిత్స

కరోనాతో హైదరాబాద్‌లో మృతి చెందిన 76 ఏళ్ల బెంగళూరు వ్యక్తి మహమ్మద్ సిద్దిఖీ హుసేనీ అంత్యక్రియల్లో పాల్గొన్న అందరిపైనా అధికారులు నిఘా పెట్టారు. ముఖ్యంగా తాళికోటలోని ఆయన బంధువుల ఇళ్లపై నిఘా పెంచారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న 67 మందికి చికిత్స అందిస్తున్నారు. మరో నలుగురిని మాత్రం ఐసోలేషన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని నిన్న సందర్శించిన కలెక్టర్ వారికి అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు. కరోనా అనగానే భయపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. అయితే, అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే కాల్‌సెంటర్లు, హెల్ప్‌లైన్ల సాయం తీసుకోవాలని సూచించారు.

వైరస్ సోకిన వారితో సన్నిహితంగా ఉండడం వల్ల మాత్రమే అది వ్యాపిస్తుందన్నారు. విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. దేశంలో కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన తొలి వ్యక్తిగా సిద్దిఖీ రికార్డులకెక్కారు. హైదరాబాద్‌లో మృతి చెందిన ఆయన అంత్యక్రియులు కర్ణాటకలోని కలబుర్గిలో జరిగాయి.  

  • Loading...

More Telugu News