Yanamala: డీజీపీని తప్పించి ఎన్నికలు నిర్వహించాలి: యనమల

Yanamala slams AP DGP

  • సీఎం చేతిలో డీజీపీ కీలుబొమ్మగా మారారని విమర్శలు
  • డీజీపీ రెండుసార్లు కోర్టులో నిలబడ్డారంటూ వ్యాఖ్యలు
  • పోలీస్ వ్యవస్థను డీజీపీ నిర్వీర్యం చేశారంటూ ఆగ్రహం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో టీడీపీ అగ్రనేత యనమల రామకృష్ణుడు స్పందించారు. సీఎం జగన్ చేతిలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలుబొమ్మగా మారారని, డీజీపీని తొలగించి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. 15 రోజుల వ్యవధిలో డీజీపీ రెండు పర్యాయాలు హైకోర్టులో నిలబడ్డారని విమర్శించారు. డీజీపీ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను బలహీనపర్చారని ఆరోపించారు. తప్పు చేసిన అధికారులపైనా, వారికి ప్రోత్సహించినవారిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ దౌర్జన్యాలను చూసి కూడా చర్యలు తీసుకోని అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News