Sensex: స్టాక్ మార్కెట్ మరో ఘోర పతనం.. కొనసాగుతున్న కరోనా భయాలు

Sensex Down 2700 Points As Virus Fear Rattles Markets

  • 2,713 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 756 పాయింట్లు పతనమైన నిఫ్టీ
  • 18 శాతం నష్టపోయిన ఇండస్ ఇండ్ బ్యాంక్

దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈరోజు కూడా మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. రానున్న రోజుల్లో దీని ప్రభావం ఇంకా ఎంత మేర పెరుగుతుందనే భయాందోళనతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 2,713 పాయింట్లు నష్టపోయి 31,390కి పడిపోయింది. నిఫ్టీ 756 పాయింట్లు పతనమై 9,199 పాయింట్లకు దిగజారింది. అన్నింటి కన్నా ఎక్కువగా బ్యాంకింగ్ సూచీ 8.35 శాతం నష్టపోయింది.  

బీఎస్ఈ సెన్సెక్స్ లో అన్ని కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (18.02), టాటా స్టీల్ (10.88), యాక్సిస్ బ్యాంక్ (10.65), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (10.37), ఐసీఐసీఐ బ్యాంక్ (10.08) టాప్ లూజర్లుగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News